Advertisement

బీసీ కులాల్లో మరిన్ని చేర్చడంపై అభ్యంతరాల స్వీకరణ

Jun 29 2019 @ 01:55AM

భూపాలపల్లి కలెక్టరేట్‌, జూన్‌ 28 : బీసీ కులాల్లో మరిన్నికులాలు చేర్చడంపై అభ్యంతరాలను స్వీకరించను న్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి టి.శైలజ శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీల జాబితాలో కొన్ని కులాలను చేర్చడం కోసం ఈ నెల 15వ తేదీన వచ్చిన అభ్యర్థనలపై విజ్ఞప్తులు సూచనలు, అభ్యంతరాలపై జూలై 11వ తేదీ సాయంత్రం 5గంటలోగా హైదరాబాద్‌లోని వెనుకబడిన తరగతుల కమిషన్‌కు అందించాల న్నారు. బీసీల్లో చేరడం కోసం 30 కులాలు కోరడం జరిగిందని తెలి పారు. బీసీల్లో చేర్చడంకోసం కోరిన కులాలు కాకిపడగల, మందెచ్చుల, బత్తిన, కుల్లకడిగ, బైల్‌ కమ్మర, బాగోతుల, బోప్పల, తోలుబోమ్మలాట వాళ్ళు, గంజికూటివారు, శ్రీరక్షత్రియ రామజోగి, ఏనూటి, గుర్రపువారు, అద్దపువారు, కడారి సైదరోళ్ళు, నరగాని, ఓడ్‌, మాపయ్యలు, సాధనా శూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవులవారు, గౌడజెట్టి, ఆదికోడుకులు, తెరచీరల, సారోళ్ళు, అరవకోమటి, అహీర్‌ యాదవ్‌, గోవిలి కులాలు దరఖాస్తులు చేసు కున్నాయని పేర్కొన్నారు. ఇట్టి కులాలు బీసీల్లో చేర్చడంపై ఏమైనా వినతులు, అభ్యంతరాలు, సూచనలు ఉంటే వెనకబడిన తరగతుల కమిషన్‌కు విజ్ఞప్తి చేయాలని తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.