Advertisement

అక్షర ధామం

Published: Wed, 25 Dec 2019 05:19:44 IST
అక్షర ధామం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు24 (ఆంధ్రజ్యోతి): భిన్న అభిరుచులకు, విభిన్న ఆలోచనలకు కూడలి ‘‘హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం’’. ఆధ్యాత్మిక రచనలతో మానసిక ఉపశమనం పొందాలనుకునే పెద్దలు... బొమ్మల కథలతో ఆనందాన్ని ఆస్వాదించే చిన్నారులు... కథ, నవలా సాహిత్యంతో తన్మయత్వాన్ని పొందే యువత... నిత్యజీవిత ఒడిదుడుకులకు విరుగుడుగా అక్షరాల చెట్టునీడలో సేదతీరే మధ్య వయస్కులు... వర్తమానంపై ప్రేమున్నోళ్లు... భవిష్యత్తుపై ఆశవున్నోళ్లు... చరిత్రపై మమకారంగల వారందరికీ ఒకే చోటు.. అదే బుక్‌ఫెయిర్‌. రెండవ రోజు పుస్తక ప్రదర్శన ప్రాంగణం పుస్తక ప్రేమికులతో అక్షర ధామాన్ని తలపించింది. దాదాపు యాభై వేల మంది సందర్శించినట్లు సమాచారం.
 
ఏ పుస్తకాలు ఏ స్టాల్‌లో ఉంటాయంటే...
ఆధ్యాత్మిక, భక్తి పుస్తకాలు .....
 
మహా భారతం, భాగవతం, రామాయణం తదితర పురాణ గ్రంథాలు.. వాస్తు, జ్యోతిష్యం,
ఉపనిషత్తులు, వేదాలు, తదితర హిందూమత రచనలతో పాటూ బైబిల్‌, ఖురాన్‌ వంటి అన్ని మతాలకూ చెందిన ఆధ్యాత్మిక, భక్తి సాహిత్యం లభ్యమయ్యే స్టాళ్ల నెంబర్లు... 30, 44, 52, 53, 71, 72, 76, 85, 120, 130, 131, 137, 149, 168, 172, 182, 191, 195, 220, 222, 224, 229, 241, 252, 255, 294, 297 తదితర అంగళ్లు.
 
అభ్యుదయ, విప్లవ, అస్తిత్వవాద సాహిత్యం ప్రత్యేకం ....
9, 12, 34, 95, 141, 148, 265, 280, 281, 285, 304, 305 స్టాళ్లలో మార్క్సిజం, లెనినిజం, మావో, తదితర కమ్యూనిస్టు రచనలు, ప్రగతిశీల రచనలు, నవలలు, కథా సాహిత్యంతోపాటూ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషణల వ్యాసాలు, దళిత, బహుజన, మైనార్టీ తదితర అస్తిత్వవాద సాహిత్యం లభ్యమవుతాయి.
 
బాలల సాహిత్యం కోసం...
23, 54, 62, 64, 98, 110, 112, 121, 247, 256, 301 స్టాళ్లను సందర్శించవచ్చు. కామిక్స్‌, ఫిక్షన్‌ ఆంగ్ల కథలు దాదాపుగా అన్నీ రిమైండర్‌ బుక్‌స్టాళ్లలో లభ్యమవుతున్నాయి.
వ్యక్తిత్వ వికాసం....
65, 124, 214, 234, 269, 317, 320 పుస్తక స్టాళ్లలో వ్యక్తిత్వవికాసానికి సంబంధించిన పలు రచనలు అందుబాటులో ఉన్నాయి.
 
శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రచనలు, అకడమిక్‌ పుస్తకాలు...
91, 171, 179, 242, 262, 271, 279, 288 స్టాళ్లలో పోటీపరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌, ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, నీట్‌, ఎంసెట్‌, ఐఐటీ తదితర పుస్తకాలతోపాటూ ఆరోగ్య అవగాహనకు సంబంధించిన పలు రచనలు, న్యాయ, మనస్తత్వ శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సాంఘిక, ఖగోళ, భౌతిక, రసాయన, జీవ, గణిత శాస్త్రా ప్రయోగాలకు చెందిన పలు పరికరాల కోసం 46, 115, 117, 123, 127 స్టాళ్లను సంప్రదించొచ్చు.
 
కళలు, భాషా శాస్త్రాలు, తెలంగాణ సాహిత్యం కోసం...
1, 3, 16, 77, 102, 106, 177, 207, 272, 318, 319 తదితర స్టాళ్లలో భారతీయ కళలు, సంస్కృతికి సంబంధించిన పుస్తకాలతోపాటూ తెలంగాణ సాహిత్యం కోసం ఆ స్టాళ్లను సందర్శించవచ్చు.
 
రిమైండర్‌ ఇంగ్లీషు బుక్స్‌.....
26, 40, 42, 43, 50, 51, 61, 67, 78, 93, 133, 150, 151, 185, 187, 231, 235, 237, 244, 249, 253, 259, 263, 286, 293 తదితర స్టాళ్లన్నీ రిమైండర్‌ ఆంగ్ల సాహిత్యానికి చిరునామా. అందులో ఫిక్షన్‌, నాన్‌ఫిక్షన్‌ నవలలు, ఆరోగ్యం, వ్యక్తిత్వవికాసం, కామిక్స్‌, కాఫీటేబుల్‌ బుక్స్‌, బయోగ్రఫీస్‌, ఆర్ట్‌ అండ్‌ లిటరేచర్‌ తదితర పుస్తకాలు లభ్యమవుతాయి. మూడు ఆంగ్ల నవలలు వంద రూపాయలకు అందిస్తున్నారు. మరికొన్ని స్టాళ్లలో ప్రత్యేక రాయితీలనూ ఇస్తున్నారు.

ఆంగ్ల సాహిత్యం...
4, 10, 18, 20, 22, 49, 81, 83, 88, 94, 138, 170, 174, 180, 183, 218, 223, 267, 274, 278, 296, 308, 311, 313 తదితర స్టాళ్లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషణలు, చరిత్ర పుస్తకాలు, వివిధ అస్తిత్వవాద రచనలు, సైన్స్‌కు సంబంధించిన రచనలు, లెఫ్ట్‌వరల్డ్‌, సేజ్‌ పబ్లికేషన్స్‌, పెంగ్విన్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, హాచెట్టే, హర్పర్‌ కొల్లిన్స్‌ తదితర ప్రసిద్ధ ఆంగ్ల ప్రచురణ సంస్థల స్టాళ్లు బుక్‌ఫెయిర్‌లో కొలువుదీరాయి.
 
సకల సాహిత్య పుస్తకాల కోసం...
7, 11, 38, 56, 57, 101, 104, 136, 145, 155, 176, 211, 215, 239, 257, 275, 298, 309 తదితర పుస్తక స్టాళ్లలో నవల, కథా, కవిత్వ సాహిత్యంతోపాటూ వ్యక్తిత్వవికాసం, భక్తి, ఆధ్యాత్మికం, ఫిట్‌నెస్‌ తదితర అంశాలకు చెందిన సకల సాహిత్య సాహిత్య పుస్తకాలు లభ్యమవుతాయి. వాట

వ్యక్తుల ప్రచురణలు - ఇతర పుస్తకాల స్టాళ్లు...
ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌ బౌద్ధ సాహిత్యం - 46
ద్రవిడియన్‌ యూనివర్సిటీ, కుప్పం - 48
జనవిజ్ఞాన వేదిక ప్రచురణలు - 60
మిలింద్‌ ప్రకాశన్‌ హిందీ రచనలకోసం - 74.
బుద్ధ భూమి - 75
కథాప్రపంచం, ఆంధ్రప్రదేశ్‌. - 80
కత్తిపద్మారావు రచనలు ‘‘లోకాయుత’’ ప్రచురణలు - 84.
వాసిరెడ్డి పబ్లికేషన్స్‌ - 90
విశ్వనాథ సత్యనారాయణ సమగ్ర సాహిత్యం - 100
కార్టూన్లు - 109.
నక్షత్ర మ్యూజిక్‌ సెంటర్‌ - 128.
చలం సమగ్రసాహిత్యం - 132.
మిసిమి ప్రచురణలు - 153.
హుడా పబ్లికేషన్స్‌ ఉర్దూ సాహిత్యం కోసం.. - 154.
సాహిత్య అకాడమీ, బెంగుళూరు - 192.
చైతన్య మహిళా సంఘం - 181.
అక్షరయాన్‌ రచయిత్రుల వేదిక - 204.
రైటర్స్‌ హాల్‌ - 205
దక్కన్‌ ల్యాండ్‌ - 227.
పాలపిట్ట ప్రచురణలు - 219
జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్‌ - 233.
గీటురాయి ఇస్లామిక్‌ తెలుగు ప్రచురణలు - 251.
తెలుగు అకాడమీ - 289.
ఈషా ఫౌండేషన్‌ - 292.
పబ్లికేషన్‌ డివిజన్‌ - 301.
సెన్‌సెస్‌ ఆఫ్‌ ఇండియా - 310
తెలుగు రచయితల సాహిత్యం - 321
కవిసంగమం - 322

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.