గోరుచిక్కుడు గారెలు

ABN , First Publish Date - 2015-08-30T21:09:56+05:30 IST

కావలసిన పదార్థాలు : గోరు చిక్కుడు కాయలు - పావు కిలో, నూనె - తగినంత, పుట్నాలు - 50 గ్రా

గోరుచిక్కుడు గారెలు

కావలసిన పదార్థాలు : గోరు చిక్కుడు కాయలు - పావు కిలో, నూనె - తగినంత, పుట్నాలు - 50 గ్రా, పచ్చిమిర్చి - ఆరు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక చెంచా, జీలకర్ర - ఒక చెంచా, ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు, పసుపు - తగినంత, ఉప్పు - తగినంత.
తయారీ విధానం :
చిక్కుడుకాయలను ఉడకబెట్టి నార తీసివేయాలి. తర్వాత మిక్సీలో వేసి అందులో పుట్నాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి రుబ్బుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఎర్రగా వేయించాలి. అంతే గోరుచిక్కుడుకాయ గారెలు రెడీ.

Updated Date - 2015-08-30T21:09:56+05:30 IST