పాల అరిసెలు

ABN , First Publish Date - 2015-09-02T17:38:01+05:30 IST

కావలసిన పదార్థాలు: బియ్యం - 2 కప్పులు, బెల్లం పొడి - 1 కప్పు, పాలు - తగినన్ని, యాలకుల పొడి

పాల అరిసెలు

కావలసిన పదార్థాలు: బియ్యం - 2 కప్పులు, బెల్లం పొడి - 1 కప్పు, పాలు - తగినన్ని, యాలకుల పొడి - అర టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా. గసగసాలు / నువ్వులు - అర కప్పు.
తయారుచేసే విధానం: బియ్యాన్ని 6 గంటలపాటు నానబెట్టి నీరు వడకట్టి, ఆరబెట్టి, పిండి కొట్టాలి. వెడల్పాటి పళ్లెంలో బియ్యం పొడి, బెల్లం పొడి, యాలకులపొడి, పాలు వేసి ముద్దలా కలపాలి. తర్వాత చిన్నచిన్న ఉండలు చేసుకొని పూరీల్లా వత్తి రెండువైపులా గసగసాలు/ నువ్వులు అద్ది నూనెలో దోరగా వేగించాలి. ఇవి 4 రోజులు నిలువ ఉంటాయి.

Updated Date - 2015-09-02T17:38:01+05:30 IST