పాలక్‌ కజ్జికాయలు

ABN , First Publish Date - 2015-09-02T17:39:19+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలకూర - 400 గ్రా., తరిగిన ఉల్లిపాయ - 1, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను

పాలక్‌ కజ్జికాయలు

కావలసిన పదార్థాలు: పాలకూర - 400 గ్రా., తరిగిన ఉల్లిపాయ - 1, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను, నూనె - 150 గ్రా., ఉప్పు రుచికి తగినంత, గోధుమపిండి - 400 గ్రా., వెన్న - 50 గ్రా.
తయారుచేసే విధానం: పిండిలో ఉప్పు, వెన్న, 50 గ్రా. నూనె చేర్చి తగినంత నీరు పోస్తూ పూరీల పిండిలా కలిపి గంటపాటు నాననివ్వాలి. పాలకూరను ఉప్పునీటిలో కడిగి, సన్నగా తరి గి, ఇందులో ఉల్ల్లి తరుగు, నిమ్మరసం, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. గోధుమపిండిని చిన్న ఉండలుగా చేసి, పూరీల్లా చేస్తూ మధ్యలో పాలకూర మిశ్రమాన్ని పెడు తూ కజ్జికాయల్లా వత్తి నూనెలో దోర గా వేగించుకోవాలి.

Updated Date - 2015-09-02T17:39:19+05:30 IST