కంద గారెలు

ABN , First Publish Date - 2015-08-30T21:14:15+05:30 IST

కావలసిన పదార్థాలు: కంద ముక్కలు - 1 కప్పు, బియ్యప్పిండి - 1 టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి - 3, ఉప్పు

కంద గారెలు

కావలసిన పదార్థాలు: కంద ముక్కలు - 1 కప్పు, బియ్యప్పిండి - 1 టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి - 3, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పచ్చిమిర్చితో కలిపి కంద ముక్కల్ని రుబ్బుకోవాలి. ఒక పాత్రలో ఈ మిశ్రమంతో పాటు బియ్యప్పిండి, ఉప్పు కలిపి ముద్దలా చేసుకొని 5 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి, అరచేతిలో గారెల్లా ఒత్తుకుంటూ నూనెలో దోరగా వేగించుకోవాలి. ఈ గారెలకు కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్‌.

Updated Date - 2015-08-30T21:14:15+05:30 IST