పూరీ అరెసెలు

ABN , First Publish Date - 2015-09-02T17:49:01+05:30 IST

కావలసినవి: గోధుమ పిండి- గిన్నెడు, బొంబాయి రవ్వ- పావు గిన్నెడు, నూనె- రెండు లేక మూడు టేబుల్‌ స్పూన్‌లు

పూరీ అరెసెలు

కావలసినవి: గోధుమ పిండి- గిన్నెడు, బొంబాయి రవ్వ- పావు గిన్నెడు, నూనె- రెండు లేక మూడు టేబుల్‌ స్పూన్‌లు, పెరుగు - రెండు టేబుల్‌ స్పూన్‌లు,
సిరప్‌ కోసం: పంచదార, రెండు గిన్నెలు నీళ్లు - గిన్నెలో మూడుపావులు కొలత, కుంకుమ పువ్వు చిటికెడు, నిమ్మరసం- మూడు టేబుల్‌ స్పూన్‌లు
తయారీ విధానం
గోధుమ పిండి, రవ్వలో రెండు స్పూన్‌లు నూనె, పెరుగు వేసి నీళ్లు సరి చూసుకుంటూ పిండి చేతులకు అంటకుండా ఉండేలా మెత్తగా కలపాలి. పిండిపై తడి బట్టను కప్పి ఒక గంట నాననివ్వండి. తర్వాత పదిపదిహేను నిమిషాల పాటు పిండిని మృదువుగా అయ్యేలా మర్దనా చేయండి. పంచదారని తీగపాకం వచ్చేలా ఉడికించండి. చిటికెడు కుంకుమ పువ్వు, నిమ్మరసం దాని కి చేర్చి సన్నని సెగమీద ఉంచుకోండి. పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని పూరీలలా వత్తుకోండి. వాటిని ముదురు ఎరుపు రంగు వచ్చేంత వరకూ వేగించి వేడివేడిగా పంచదార పాకంలో వేసి పూర్తిగా మునిగేలా చూసుకోం డి. ఐదు నుంచి పది నిముషాలు నాననిచ్చి తీసి వాటిని ఏటవాలుగా ఏదైనా ప్లేటులో అమర్చండి. దాని వలన వాటికి ఎక్కువగా ఉన్న పాకం జారిపోతుంది. చల్లారిన తరువాత ఈ పూరీ అరిసెలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి.

Updated Date - 2015-09-02T17:49:01+05:30 IST