కొబ్బరి బొబ్బట్లు

ABN , First Publish Date - 2015-09-02T17:15:33+05:30 IST

కావలసిన పదార్థాలు: పచ్చికొబ్బరి కోరు - 1కప్పు, బెల్లం తురుము - 1 కప్పు, మైదా - పావుకేజి

కొబ్బరి బొబ్బట్లు

కావలసిన పదార్థాలు: పచ్చికొబ్బరి కోరు - 1కప్పు, బెల్లం తురుము - 1 కప్పు, మైదా - పావుకేజి, ఏలకుల పొడి - అర టీ స్పూను, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో కొబ్బరితురుము, బెల్లం కలిపి సన్నని సెగమీద పావుగంట ఉడికిస్తే గట్టిపడుతుంది. చల్లారనిచ్చి, ఏలకులపొడి కలిపి (తడిచేయి తగలకుండా) రోట్లో వేసి రుబ్బుకోవాలి. మైదాపిండిని 3 గంటల ముందు నీటితో (నూనె కూడా జతచేసి) ముద్దగా చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని సమాన భాగాలుగా చేసుకుని అరిటాకు/పాలితిన్‌ కాగితంపై చేత్తో పూరీలా వత్తుకోవాలి. మధ్యలో కొబ్బరి పూర్ణాన్ని పెట్టి మైదాతో మూసేసి కాస్త పలచగా వత్తుకొని పెనంపై రెండువైపులా నెయ్యితో వేగించుకోవాలి. వేడిమీద తిన్నా, చల్లారాక తిన్నా ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-02T17:15:33+05:30 IST