పనస బూరెలు

ABN , First Publish Date - 2015-09-02T17:40:30+05:30 IST

కావలసిన పదార్థాలు: పనసపండు తొనల ముక్కలు (గింజలు లేకుండా) - 2 కప్పులు, బొంబాయి రవ్వ

పనస బూరెలు

కావలసిన పదార్థాలు: పనసపండు తొనల ముక్కలు (గింజలు లేకుండా) - 2 కప్పులు, బొంబాయి రవ్వ - 1 కప్పు, పచ్చికొబ్బరి కోరు - 2 టీ స్పూన్లు, జీడిపప్పులు - 10, ఉప్పు - చిటికెడు, బెల్లం తురుము - 200 గ్రా., నూనె - వేగించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: పనస తొనలు, కొబ్బరి కోరు, బెల్లం తురుము ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ గ్రైండు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో బొంబాయి రవ్వ, ముక్కలు చేసుకున్న జీడిపప్పులు, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు ఫ్రిజ్‌లో లేదా చల్లని ప్రదేశంలో పెట్టాలి. తర్వాత గోలీకాయంత సైజులో ఉండలుగా చేసుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

Updated Date - 2015-09-02T17:40:30+05:30 IST