బొబ్బర్ల గారెలు

ABN , First Publish Date - 2015-08-30T20:49:46+05:30 IST

కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, బచ్చలి కూర 1 కప్పు, జీలకర్ర - అర టీ స్పూను, బియ్యప్పిండి

బొబ్బర్ల గారెలు

కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, బచ్చలి కూర 1 కప్పు, జీలకర్ర - అర టీ స్పూను, బియ్యప్పిండి - 3 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, చిన్న ఉల్లిపాయ - 1, అల్లం - అంగుళం ముక్క, కొత్తిమీర తరుగు - అరకప్పు, కరివేపాకు - 4 రెబ్బల తరుగు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం: బొబ్బర్లను 5 గంటలు నానబెట్టి నీళ్లు పోయకుండా, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఈ ముద్దలో సన్నగా తరిగిన బచ్చలి, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లి, జీర, కొత్తిమీర వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కాగిన నూనెలో గారెల్లా వేసి మంట బాగా తగ్గించి నిదానంగా లోపల కూడా ఉడికేలా దోరగా వేగించుకోవాలి.

Updated Date - 2015-08-30T20:49:46+05:30 IST