సగ్గుబియ్యం గారెలు

ABN , First Publish Date - 2015-09-02T17:55:09+05:30 IST

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం - 1 కప్పు, ఉడికించిన ఆలుగడ్డ గుజ్జు - 2 కప్పులు

సగ్గుబియ్యం గారెలు

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం - 1 కప్పు, ఉడికించిన ఆలుగడ్డ గుజ్జు - 2 కప్పులు, వేగించి పొట్టుతీసిన వేరుశనగపప్పు - అరకప్పు, జీలకర్ర - 1 టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, పంచదార - చిటికెడు, నిమ్మరసం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి - 3 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం : సగ్గుబియ్యం కడిగి ఒక రాత్రంతా నానబెట్టాలి. వేరుశనగపప్పును బరకగా దంచుకోవాలి. వెడల్పాటి పాత్రలో (నీరు పిండిన) సగ్గుబియ్యం, ఆలు గుజ్జు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, పంచదార, నిమ్మరసం, వేరుశనగ తురుము, ఉప్పు కలిపి ముద్దగా చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని బియ్యప్పిండిలో దొర్లించి గారెల్లా వత్తి రిఫ్రిజిరేటర్లో 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత నూనెలో దోరగా వేగించాలి. నవరాత్రుల సందర్భంగా ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రల్లో ప్రత్యేకంగా చేసే గారెలివి.

Updated Date - 2015-09-02T17:55:09+05:30 IST