క్యాబేజీ గారెలు

ABN , First Publish Date - 2015-08-30T20:51:33+05:30 IST

కావలసిన పదార్థాలు: పొట్టు మినప్పప్పు - పావు కేజి, కాబేజీ తరుగు- 2 కప్పులు, పచ్చిమిర్చి తరుగు

క్యాబేజీ గారెలు

కావలసిన పదార్థాలు: పొట్టు మినప్పప్పు - పావు కేజి, కాబేజీ తరుగు- 2 కప్పులు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పొట్టుమినప్పప్పుని రెండుగంటల పాటు నానబెట్టాలి. పొట్టు పోగా మిగిలిన పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కాబేజీ, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి అన్నీ బాగా కలపాలి. తర్వాత గారెల్లా చేత్తో వత్తుకుని నూనెలో దోరగా వేగించాలి. ఇవి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-30T20:51:33+05:30 IST