సున్నుండలు

ABN , First Publish Date - 2015-09-02T18:00:03+05:30 IST

కావల్సినవి: మినపప్పు- 3 కప్పులు, బియ్యం - 1/2 కప్పు, పంచదార - 3 కప్పులు, నెయ్యి - 2 కప్పులు

సున్నుండలు

కావల్సినవి: మినపప్పు- 3 కప్పులు, బియ్యం - 1/2 కప్పు, పంచదార - 3 కప్పులు, నెయ్యి - 2 కప్పులు, జీడిపప్పు - 4 టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం:
మినప్పప్పు, బియ్యం దోరగా వేయించుకొని గ్రైండ్‌ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్‌ చేయకూడదు. జీడిపప్పు కూడా నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పంచదార కూడా విడిగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. మినప్పప్పు పిండి, పంచదార పొడి, జీడిపప్పు బాగా కలపాలి. ఇప్పుడు నెయ్యి పోసి కలిపి నిమ్మకాయంత పరిమాణంలో ఉండలుగా కడితే సున్నుండలు రెడీ.

Updated Date - 2015-09-02T18:00:03+05:30 IST