కజ్జికాయలు

ABN , First Publish Date - 2015-08-30T21:12:47+05:30 IST

కావల్సినవి: మైదా/గోధుమ పిండి - 3 కప్పులు, కొబ్బరి తురుము- 1 కప్పు, చక్కెర - 2 కప్పులు, జీడిపప్పు

కజ్జికాయలు

కావల్సినవి: మైదా/గోధుమ పిండి - 3 కప్పులు, కొబ్బరి తురుము- 1 కప్పు, చక్కెర - 2 కప్పులు, జీడిపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు (సన్నగా తరిగినవి)
యాలకులు - 4 , నెయ్యి - 4 టేబుల్‌స్పూన్లు, పాలు/నీళ్లు - తగినన్ని, రిఫైన్డ్‌ ఆయిల్‌ - వేయించడానికి తగినంత
తయారీ విధానం:
తురిమిన కొబ్బరిని మూకుడులో వేసి సన్నటి సెగపై వేయించుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి వేసి రవ్వను కూడా వేయించాలి. జీడిపప్పు కూడా దోరగా వేయించి చక్కెర, రవ్వ, కొబ్బరి, యాలకుల పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి.
మైదా పిండిలో నూనె లేదా నెయ్యి వేసి, తగినన్ని నీళ్లు లేదా పాలు పోస్తూ ముద్దగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను గాలి తగలకుండా పైన గిన్నె బోర్లించి ఓ గంటసేపు ఉంచాలి. ఇలా చేస్తే పిండి మెత్తగా అవుతుంది. ఇప్పుడు పూరీ చేయడానికి కావాల్సినంత సైజులో పిండిని తీసుకుంటూ పూరీలుగా వత్తాలి. రవ్వ, కొబ్బరి మిశ్రమాన్ని స్పూన్‌తో తీసుకొని ఒకవైపు పెట్టి మరోవైపునుంచి మూసివేయాలి. చివర్లను నీళ్లు లేదా పాలు లేదా నూనెతో అద్దుకుంటూ అదమాలి. కట్టర్‌తో కూడా కట్‌చేయవచ్చు. ఇలా కావల్సినన్ని తయారు చేసుకున్నాక మూకుడులో నూనెపోసి మరిగిన తర్వాత కజ్జికాయల్ని దోరగా వేయించుకోవాలి.

Updated Date - 2015-08-30T21:12:47+05:30 IST