ఆలూ జంతికలు

ABN , First Publish Date - 2015-08-26T21:41:03+05:30 IST

కావలసిన పదార్థాలు: బంగాళదుంప తురుము - అరకప్పు, బియ్యప్పిండి - 220 గ్రా., నెయ్యి - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను

ఆలూ జంతికలు

కావలసిన పదార్థాలు: బంగాళదుంప తురుము - అరకప్పు, బియ్యప్పిండి - 220 గ్రా., నెయ్యి - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, కారం - 1 టీ స్పూను, జీరాపొడి - 1 టీ స్పూను, వాము - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరపడా.
తయారుచేసే విధానం : ముందుగా బియ్యప్పిండిలో వాము, కారం, ఉప్పు, జీరాపొడి, పసుపు, బంగాళదుంప తురుము వేసి నీరు కలుపుతూ ముద్దలా తయారుచేసుకోవాలి. దీన్ని కనీసం 20 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత జంతికలు చేసుకునే చట్రంలో కొంత కొంత పిండి వేస్తూ నూనెలో జంతికల్లా దోరగా వేగించి తీసెయ్యాలి. ఈ జంతికల్లో బంగాళదుంప కలవడం వల్ల వెరైటీ రుచితో కమ్మగా ఉంటాయి.

Updated Date - 2015-08-26T21:41:03+05:30 IST