చక్కెర బొబ్బట్లు

ABN , First Publish Date - 2015-08-30T20:53:03+05:30 IST

కావలసిన వస్తువులు: ఒకటిన్నర కప్పు మైదా, అరకప్పు గోధుమపిండి, రెండు టేబుల్‌ స్పూన్ల నూనె

చక్కెర బొబ్బట్లు

కావలసిన వస్తువులు: ఒకటిన్నర కప్పు మైదా, అరకప్పు గోధుమపిండి, రెండు టేబుల్‌ స్పూన్ల నూనె, బొబ్బట్లు కాల్చడానికి తగినంత నెయ్యి
బొబ్బట్లలో నింపడానికి: 250 గ్రా. శనగపప్పు, 250 గ్రా. పంచదార, అర టీ స్పూను యాలకుల పొడి, 6-8 కుంకుమపువ్వు రెక్కలు, 3 టేబుల్‌స్పూన్లు పాలు
తయారుచేసే విధానం:
ముందుగా శనగపప్పును మెత్తగా ఉడికించి నీటిని వడకట్టుకోవాలి. గోరువెచ్చని పాలల్లో కుంకుమపువ్వుని వేసి 15 నిమిషాలు నానబెట్టాలి. ఒక పాత్రలోకి ఉడికించిన శనగపప్పు తీసుకొని పంచదార, యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి ముద్దలా కలుపుకోండి. మైదాలో కొద్దిగా నూనె వేస్తూ, నీరు కలుపుతూ చపాతీ పిండి తయూరుచేసుకోండి. పిండి మెత్తదనం కోసం 10 నిమిషాలు నానబెట్టండి. పన్నెండు భాగాలుగా విభజించి ఒక్కో పిండి ముద్దని గుండ్రంగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని మధ్యలో శనగపప్పు మిశ్రమ ముద్దని పెట్టి అంచుల్ని మూసేయండి. మళ్లీ చపాతీలా వత్తండి. పెనం మీద నేతితో రెండు వైపులా బంగారురంగు వచ్చేలా కాల్చండి. ఇవి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-30T20:53:03+05:30 IST