చంద్ర కాంతలు

ABN , First Publish Date - 2015-08-30T20:56:24+05:30 IST

కావలసిన వస్తువులు: ( 25 - 30 చంద్రకాంతలకు )పెసరపప్పు ఒక కప్పు, ఒకటిన్నర కప్పు పంచదార

చంద్ర కాంతలు

కావలసిన వస్తువులు: ( 25 - 30 చంద్రకాంతలకు )పెసరపప్పు ఒక కప్పు, ఒకటిన్నర కప్పు పంచదార, సగం కప్పు తురిమిన పచ్చి కొబ్బరి, పావు కప్పు జీడిపప్పు ముక్కలు, ఒక టీ స్పూన్‌ యాలకుల పొడి, వేయించడానికి సరపడా నూనె.
తయారుచేసే విధానం
పెసరపప్పును గంట సేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. 3,4 టీస్పూన్ల నీటిని కలిపి కాస్త జారుగానే చేసుకోవాలి. వెడల్పాటి పాత్రలో పంచదార, రుబ్బిన పెసరపప్పు తురిమిన కొబ్బరి, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలపాలి. ఈ పాత్రను సన్నని సెగపై ఉంచి పంచదార కరిగి తీగపాకం వచ్చేవరకూ అడుగంటకుండా తిపతూ ఉండాలి. దించేముందు యాలకుల పొడి చల్లాలి. ఈ మిశ్రమాన్ని తడిగుడ్డపై పోసి నూనె పూసిన బల్లపరపు కర్రతో కాస్త దళసరిగా ఉండేట్టుగా సమానంగా చేయాలి. ఆ తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఇపడు మనకు ఇష్టమైన షేపుల్లో ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక వెడల్పాటి మూకుడులో నూనెపోసి కట్‌చేసిన ముక్కల్ని బంగారురంగు వచ్చేవరకూ వేయించి తీయాలి.

Updated Date - 2015-08-30T20:56:24+05:30 IST