అత్త్తిరసాలు

ABN , First Publish Date - 2015-08-29T23:55:52+05:30 IST

కావలసిన పదార్థాలు: బియ్యప్పిండి (బియ్యాన్ని 6 గంటలపాటు నానబెట్టి, ఆరబెట్టి దంచి జల్లించింది) - 1 గ్లాసు

అత్త్తిరసాలు

కావలసిన పదార్థాలు: బియ్యప్పిండి (బియ్యాన్ని 6 గంటలపాటు నానబెట్టి, ఆరబెట్టి దంచి జల్లించింది) - 1 గ్లాసు, బెల్లం - అరగ్లాసు, నీరు - అర గ్లాసు, యాలకులపొడి - అర టీ స్పూను, ఎండుకొబ్బరి పొడి - 2 టీ స్పూన్లు, నువ్వులు - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: బెల్లం, నీరు కలిపి వేడిచేయాలి. బెల్లం కరిగి బుడగలు వస్తుండగా ఎండుకొబ్బరి, నువ్వులు, యాలకులపొడి వేసి తీగపాకం రాగానే బియ్యప్పిండిని (ఉండలు చుట్టకుండా) కలుపుతూ ముద్దలా తయారుచేసుకోవాలి. ఈ ముద్దని నిమ్మకాయ సైజులో సమాన భాగాలు చేసుకొని అత్తిరసాలుగా ఒత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి.

Updated Date - 2015-08-29T23:55:52+05:30 IST