కొబ్బరి సేమ్యా బొబ్బట్లు

ABN , First Publish Date - 2015-09-02T17:22:47+05:30 IST

కావలసినవి: మైదా - ఒక కప్పు, సేమ్యా (నానబెట్టినది) - ఒక కప్పు, పంచదార లేక బెల్లం - ఒక టేబుల్‌ స్పూన్‌

కొబ్బరి సేమ్యా బొబ్బట్లు

కావలసినవి: మైదా - ఒక కప్పు, సేమ్యా (నానబెట్టినది) - ఒక కప్పు, పంచదార లేక బెల్లం - ఒక టేబుల్‌ స్పూన్‌, పాలు - 250 మి.లీ , నూనె వేగించడానికి తగినంత, బొబ్బట్లలో నింపడానికి, నెయ్యి - 1-2 టేబుల్‌ స్పూన్‌, కొబ్బరి తురుము - అర చిప్ప, నువ్వులు, జీడిపప్పు ముక్కలుగా చేసినవి - ఒక టేబుల్‌ స్పూన్‌, చిటికెడు యాలకుల పొడి... కోవా - 100 గ్రాములు,
పాలు - 500 మి.లీ.
తయారీ విధానం
మైదాపిండి, సేమ్యా, బెల్లం లేక పంచదారలో పాలు పోసి పిండి మృదువుగా ఉండేలా కలిపి ఉంచుకోండి. తరువాత మందపాటి అడుగు ఉన్న గిన్నెలో నెయ్యిని వేడి చేసి అందులో కొబ్బరి తురుము వేసి వేగిం చండి. దానికి పంచదార, డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు, యాలకుల పొడి, కోవా వేసి బాగా వేగించండి. తరువాత పాలని పోసి బాగా ఉడకించి పొడిగా అయ్యేంత వరకూ కలియబెట్టండి. నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని గుండ్రంగా పల్చగా వత్తుకుని అందులో కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఆమ్లెట్‌ని మడిచినట్లుగా మధ్యలోకి మడిచి అంచులు వత్తుకోండి. కజ్జికాయలు ఎలా చేస్తారో అలా... దానిని పెనం మీద వేసి రెండువైపులా ఎర్రగా మారేలా కాల్చండి. ఇలాగే మిగిలిన పిండిని కూడా తీసుకుని ఒక్కొక్కటిగా బొబ్బట్లను తయారు చేయండి. వేడి వేడి అరటి ఆకులలో వడ్డిస్తే రుచితో పాటు చూడడానికి కూడా బాగుంటుంది.

Updated Date - 2015-09-02T17:22:47+05:30 IST