కొత్తిమీర పులిహోర

ABN , First Publish Date - 2015-09-02T17:26:35+05:30 IST

కావలసిన పదార్థాలు: కొత్తిమీర (విడి) ఆకులు - 1 కప్పు, పొడి అన్నం - పావు కేజి బియ్యంతో వండింది

కొత్తిమీర పులిహోర

కావలసిన పదార్థాలు: కొత్తిమీర (విడి) ఆకులు - 1 కప్పు, పొడి అన్నం - పావు కేజి బియ్యంతో వండింది , చింతపండు గుజ్జు - 1 కప్పు, అల్లం తరుగు - 1 టేబుల్‌ స్పూను, శనగపప్పు - 2 టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, పసుపు - అర టీ స్పూను, ఆవాలు - 2 టేబుల్‌ స్పూన్లు, వేరుశనగపప్పు - 50 గ్రా., కరివేపాకు - గుప్పెడు, ఎండుమిర్చి - 2, పచ్చిమిర్చి - 2, ఇంగువ - పావు స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: చింతపండు గుజ్జులో కొత్తిమీర, ఉప్పు, పసుపు కలిపి సన్నని మంటపై బాగా చిక్కబడేవరకూ ఉడికించాలి. చివర్లో ఇంగువ వేసి మరో రెండు నిమిషాలు ఉంచి, తర్వాత అన్నంలో బాగా కలపాలి. తర్వాత నూనెలో అల్లం తరుగు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వేరుశనగపప్పులతో తిరగమోత వేసి ఆ అన్నంలో కలపాలి. చింతపండు గుజ్జులో ఆకు ఉడకడం వలన పులిహోర కమ్మటి కొత్తిమీర వాసనతో ఘుమ ఘుమలాడుతుంది.

Updated Date - 2015-09-02T17:26:35+05:30 IST