చిలగడ దుంప పూర్ణాలు

ABN , First Publish Date - 2015-08-30T20:58:11+05:30 IST

కావలసిన పదార్థాలు : చిలగడ దుంపలు - కేజీ, బెల్లం - అరకేజీ, వేయించిన శనగపప్పు(పుట్నాల పప్పు) - పావు కిలో

చిలగడ దుంప పూర్ణాలు

కావలసిన పదార్థాలు : చిలగడ దుంపలు - కేజీ, బెల్లం - అరకేజీ, వేయించిన శనగపప్పు(పుట్నాల పప్పు) - పావు కిలో, యాలకులు - 10గ్రా, మినప పప్పు - పావు కిలో, బియ్యం - అరకేజీ. నూనె - అర కేజీ.
తయారీ విధానం :
మొదట బియ్యం, మినప్పప్పును నీటిలో నానబెట్టుకోవాలి. తరువాత దీనిని మిక్సీలో వేసి కాస్త ఉప్పు చేర్చి పూర్ణం పిండిలా పట్టుకోవాలి. తరువాత చిలగడ దుంపలను ముక్కలు కోసి ఉడకబెట్టుకోవాలి. చల్లారిన తరువాత ఈ ముక్కలకు బెల్లం, యాలకులు కలిపి మెత్తని ముద్దలా చేసుకోవాలి. పుట్నాల పప్పును పొడిచేసి ఈ ముద్దలో కలపాలి. ఇప్పుడు ఈ ముద్దను ఉండ ల్లా చేసుకొని పూర్ణం పిండిలో ముంచి నూనెలో దోరగా వేయించి తీసుకోవాలి. దీంతో చిలగడ దుంప పూర్ణాలు రెడీ అయినట్టే. 

Updated Date - 2015-08-30T20:58:11+05:30 IST