సొజ్జప్పాలు

ABN , First Publish Date - 2016-10-09T18:46:24+05:30 IST

గోధుమ రవ్వ- రెండు కప్పులు, పచ్చికొబ్బరి తురుము- రెండు కప్పులు, చక్కెర- రెండు కప్పులు, యాలకుల పొడి- ఒక టీ స్పూను, మైదా- నాలుగు

సొజ్జప్పాలు

కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ- రెండు కప్పులు, పచ్చికొబ్బరి తురుము- రెండు కప్పులు, చక్కెర- రెండు కప్పులు, యాలకుల పొడి- ఒక టీ స్పూను, మైదా- నాలుగు కప్పులు, ఉప్పు- చిటికెడు, నెయ్యి- ఒక టేబుల్‌ స్పూను,పాలు- రెండు కప్పులు, నూనె- వేగించడానికి సరిపడా, నీళ్లు- తగినన్ని.

 
తయారీ విధానం: బాణలిలో నెయ్యి వేసి వేడెక్కాక గోధుమ రవ్వ, పచ్చికొబ్బరి తురుము వేసి వేగించాలి. ఈ మిశ్రమంలో పాలు పోసి ఒక విజిల్‌ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత యాలకుల పొడి, చక్కెర వేసి మరో పది నిమిషాలు ఉడికించి దించేయాలి. ఆ తర్వాత మైదా పిండిని కలుపుకొని చపాతీలు చేసుకోవాలి. ఈ చపాతీల మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి బొబ్బట్లలా చుట్టుకొని పెనం మీద నూనె వేస్తూ కాల్చుకోవాలి. 

Updated Date - 2016-10-09T18:46:24+05:30 IST