దద్దోజనం
ABN , First Publish Date - 2016-10-09T18:13:50+05:30 IST
బియ్యం - అరకప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పులు, పెరుగు - ఒక కప్పు, పాలు - పావు కప్పు, పచ్చిమిర్చి(సన్నగా తరిగి) - రెండు, అల్లం (సన్నగా తరిగి)- ఒకటిన్నర టీస్పూన్,
కావలసినవి: బియ్యం - అరకప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పులు, పెరుగు - ఒక కప్పు, పాలు - పావు కప్పు, పచ్చిమిర్చి(సన్నగా తరిగి) - రెండు, అల్లం (సన్నగా తరిగి)- ఒకటిన్నర టీస్పూన్, ఆవాలు - ముప్పావు టీస్పూన్, పచ్చి శెనగపప్పు - ముప్పావు టీస్పూన్, మినపప్పు - అర టీస్పూన్, కరివేపాకులు - కొన్ని, ఇంగువ - చిటికెడు, నూనె - రెండు టీస్పూన్లు, ఎండుమిర్చి - రెండు.
అన్నాన్ని గరిటెతో కొద్దిగా మెత్తగా చేయాలి. అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు పోసి కలిపి చల్లారనివ్వాలి. తరువాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.
పాన్లో నూనె వేడిచేసి ఆవాలు, పచ్చి శెనగపప్పు, మినపప్పు వేయాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, ఇంగువ వేసి కొన్ని సెకన్లు వేగించాలి.
ఈ తాలింపును పెరుగన్నంలో వేసి కలపాలి. దానిమ్మ గింజలతో అలంకరించాలి.