చెక్కలు

ABN , First Publish Date - 2018-01-13T18:13:24+05:30 IST

బియ్యప్పిండి- నాలుగు కప్పులు, శెనగపప్పు-పావు కప్పు, వేరుశెనగపప్పు (పలుకులు)- అర కప్పు, నువ్వులు...

చెక్కలు

కావలసినవి
 
బియ్యప్పిండి- నాలుగు కప్పులు, శెనగపప్పు-పావు కప్పు, వేరుశెనగపప్పు (పలుకులు)- అర కప్పు, నువ్వులు- రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర- ఒక టేబుల్‌స్పూను, కారం- మూడు టీస్పూన్లు, కరివేపాకు- సరిపడా, ఉల్లికాడలు- ఒక కట్ట, నూనె- మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు-తగినంత, నీళ్లు-పిండిని ముద్దచేయడానికి సరిపడా, నూనె-వేగించడానికి సరిపడా.
 
తయారీవిధానం
 
పచ్చి శెనగపప్పును పదిహేను నిమిషాలు నీళ్లల్లో నానబెట్టాలి. ఉల్లికాడలను సన్నగా తరగాలి. పెద్ద గిన్నె తీసుకుని అందులో బియ్యప్పిండి, కారం, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, కరివేపాకు, నానబెట్టిన శెనగపప్పు, వేరుశెనగపప్పు, ఉల్లి తరుగు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. మూడు టేబుల్‌స్పూన్ల నూనెను వేడిచేసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి కలపాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లను ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పోస్తూ చపాతీ పిండిలా తయారుచేయాలి. ఈ పిండిముద్దపై గుడ్డను కప్పి అరగంటపాటు అలాగే ఉంచాలి. చెక్కలు వేగించడానికి కడాయి తీసుకుని అందులో నూనె పోసి వేడిచేయాలి.
పిండిమద్దని నిమ్మకాయ సైజులో ఉండల్లా చేసుకోవాలి. అరచేతిలో ప్లాస్టిక్‌ కాగితం పెట్టుకుని దానిపై నూనె రాసి ఆ ఉండల్ని గుండ్రంగా ఒత్తాలి. లేదా పూరీ ప్రెస్‌ని కూడా ఉపయోగించవచ్చు. ప్రెస్‌తో పిండిని ఒత్తేటప్పుడు సున్నితంగా వత్తాలి లేకపోతే పిండి విడిపోతుంది. ఇలా తయారుచేసిన చెక్కలను వేడెక్కిన నూనెలో వేసి బంగారువర్ణం వచ్చేదాకా వేగించి నూనెలోంచి తీసేయాలి. చెక్కలు (చెక్కగారెలు) రెడీ.

Updated Date - 2018-01-13T18:13:24+05:30 IST