జంతికలు

ABN , First Publish Date - 2015-12-05T15:34:39+05:30 IST

కావాల్సిన పదార్థాలు: బియ్యం - ఒక కిలో, శెనగపప్పు - పావుకిలో, వాము - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - తగినంత.

జంతికలు

కావాల్సిన పదార్థాలు: బియ్యం - ఒక కిలో, శెనగపప్పు - పావుకిలో, వాము - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - తగినంత.
తయారుచేయు విధానం: బియ్యంలో శెనగపప్పు కలుపుకుని మెత్తగా పిండి పట్టించుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు, వాము, తగినంత ఉప్పు వేసి గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టుకుని కావల్సినంత నూనె పోసుకుని బాగా కాగాక పెద్ద రంధ్రం ఉన్న గొట్టంలో ఈ పిండిని పెట్టి జంతికలు వేయాలి. ఎరుపురంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి. కరకరలాడే జంతికలు రెడీ.

Updated Date - 2015-12-05T15:34:39+05:30 IST