శ్రావణ కుడుములు

ABN , First Publish Date - 2016-08-17T18:01:31+05:30 IST

బియ్యప్పిండి - పావుకిలో, శనగపప్పు - 100 గ్రా, కొబ్బరి తురుము - కప్పు, అల్లం తురుము - టీ స్పూన, జీలకర్ర - 10 గ్రా, ఆవాలు - టీ స్పూను, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా

శ్రావణ కుడుములు

కావలసిన పదార్ధాలు: బియ్యప్పిండి - పావుకిలో, శనగపప్పు - 100 గ్రా, కొబ్బరి తురుము - కప్పు, అల్లం తురుము - టీ స్పూన, జీలకర్ర - 10 గ్రా, ఆవాలు - టీ స్పూను, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా

 
తయారీ పద్ధతి: శనగపప్పు నానబెట్టాలి. బియ్యప్పిండిలో గోరువెచ్చని నీళ్ళు కలిపి మెత్తగా ముద్దలా చేయాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొబ్బరి తురుము, నానబెట్టి నీళ్ళు వంపిన శనగపప్పు, ఉప్పు వేసి వేయించుకోవాలి. బియ్యప్పిండిని చిన్న పూరీలా చేసి అందులో వేయించిన మిశ్రమాన్ని పెట్టి, మోదకంలా అంటే వెల్లుల్లిపాయ మాదిరిగా మడవాలి. ఇలాగే అన్నీ చేసి ఇడ్లీ కుక్కర్‌ లేదా కుక్కర్‌లో పెట్టి ఆవిరి మీద పది నిమిషాలు ఉడికించాలి. అంతే శ్రావణ వరలక్ష్మికి ఇష్ట నైవేద్యానికి కుడుములు రెడీ అయినట్లే!

Updated Date - 2016-08-17T18:01:31+05:30 IST