నేతిబీర పెరుగు గారెలు

ABN , First Publish Date - 2015-09-02T17:29:13+05:30 IST

కావలసిన పదార్థాలు: నేతిబీరకాయలు - 2, ఇంగువ - చిటికెడు, కారం - పావు టీ స్పూను, శనగపిండి

నేతిబీర పెరుగు గారెలు

కావలసిన పదార్థాలు: నేతిబీరకాయలు - 2, ఇంగువ - చిటికెడు, కారం - పావు టీ స్పూను, శనగపిండి - 4 టేబుల్‌ స్పూన్లు, అల్లం పేస్టు - పావు టీ స్పూను, జీలకర్ర పొడి - పావు టీ స్పూను, పెరుగు - 2 కపలు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: నేతి బీరకాయల్ని బాగా కడిగి, తొక్క తీయకుండా సన్నని చక్రాల్లా కట్‌ చేసుకుని, ఉప చల్లి 20 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత తడి పోవడానికి పేపర్‌పై పరవాలి. ఒక పాత్రలో శనగపిండి, కారం, ఇంగువ, ఉప వేసి నీటితో జారుగా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఒక్కో నేతిబీర చక్రాన్ని జారులో ముంచి నూనెలో దోరగా వేగించాలి. మరో పాత్రలో పెరుగు, జీలకర్ర పొడి, అల్లం పేస్టు, కారం కలిపి ఇందులో గారెల్ని ముంచి 2 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-02T17:29:13+05:30 IST