వాక్కాయ పులిహోర

ABN , First Publish Date - 2015-09-02T18:18:37+05:30 IST

కావలసిన పదార్థాలు: వాక్కాయలు - పావుకిలో, అన్నం - 3 కప్పులు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు

వాక్కాయ పులిహోర

కావలసిన పదార్థాలు: వాక్కాయలు - పావుకిలో, అన్నం - 3 కప్పులు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఆవపిండి - అర టీ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను, జీడిపప్పు - 1 టేబుల్‌ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు, శనగపప్పు - 1 టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి - 6, పచ్చి కరివేపాకు - గుప్పెడు.
తయారుచేసే విధానం: వాక్కాయల్ని సగానికి కోసి గింజలు తీసి కప్పు నీటిలో ఉడికించి నీరంతా ఇగిరిపోయాక పేస్టులా మెదుపుకోవాలి. ఈ పేస్టుతో పాటు ఉప్పు, ఆవపిండిని అన్నానికి పట్టించి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి వేగాక జీడిపప్పు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, కరివేపాకు వేగించి చల్లార్చి వాక్కాయ గుజ్జు కలిపిన అన్నంలో వేసి బాగా కలపాలి. నిమ్మ, చింతపండు, దబ్బకాయ, మామిడికాయ పులిహోరలకు భిన్నంగా కొత్త రుచితో ఉంటుంది.

Updated Date - 2015-09-02T18:18:37+05:30 IST