బీట్‌ రూట్‌ గారెలు

ABN , First Publish Date - 2015-08-29T23:59:41+05:30 IST

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ తురుము - 1 కప్పు, క్యారెట్‌ + క్యాబేజీ తురుము - అరకప్పు, శనగపప్పు - రెండున్నర కప్పులు

బీట్‌ రూట్‌ గారెలు

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ తురుము - 1 కప్పు, క్యారెట్‌ + క్యాబేజీ తురుము - అరకప్పు, శనగపప్పు - రెండున్నర కప్పులు, కందిపప్పు - అరకప్పు, ఉడికిన అన్నం - అరకప్పు, ఎండుమిర్చి - 10, సోంపు - 3 టీ స్పూన్లు, జీలకర్ర - 1 టీ స్పూను, అల్లం తురుము - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అరకప్పు, ఉల్లికాడల తరుగు - అరకప్పు, ఉల్లి తరుగు - ఒక కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: గోరువెచ్చని నీటిలో పప్పుల్ని 2 గంటలు నానబెట్టి, నీరు వడకట్టి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో అన్నం, జీలకర్ర మిశ్రమం, రుబ్బిన పప్పులు, బీట్‌రూట్‌, క్యారెట్‌, క్యాబేజీ, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. తర్వాత అరంగుళం మందంగా గారెలు వత్తుకొని నూనెలో దోరగా (లోపల కూడా ఉడికేలా) వేగించాలి. ఈ గారెలు వేడివేడిగా టమోటా కెచప్‌తో కలిపి తింటే బాగుంటాయి.

Updated Date - 2015-08-29T23:59:41+05:30 IST