గసగసాల బొబ్బట్లు

ABN , First Publish Date - 2015-08-30T21:01:27+05:30 IST

కావలసిన పదార్థాలు: బెల్లం తరుగు - 1 కప్పు, గసగసాలు - 2 టేబుల్‌ స్పూన్లు, నువ్వులు - 3 టేబుల్‌ స్పూన్లు

గసగసాల బొబ్బట్లు

కావలసిన పదార్థాలు: బెల్లం తరుగు - 1 కప్పు, గసగసాలు - 2 టేబుల్‌ స్పూన్లు, నువ్వులు - 3 టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు (బరక) పొడి - పావు కప్పు, యాలకుల గింజలు - 1 టీ స్పూను, శనగపిండి - 3 టేబుల్‌ స్పూన్లు, (వేడి) నువ్వుల నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, గోధుమపిండి - ఒకటిన్నర కప్పులు, మైదా - ముప్పావు కప్పు, శనగపిండి - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: గసగసాలు, నువ్వులు, 1 టేబుల్‌ స్పూను శనగపిండి విడివిడిగా వేగించాలి. వీటిని బెల్లం తరుగు, యాలకుల గింజలు, జీడిపప్పు పొడి, 1 టేబుల్‌ స్పూను నువ్వుల నూనెతో బాగా కలిపి పక్కనుంచాలి. ఒక పాత్రలో మైదా, గోధుమపిండి, మిగిలిన శనగపిండి+ నువ్వుల నూనెలో తగినంత నీరు పోసి ముద్ద చేయాలి. దీన్ని ఉండలు చేసుకుని చపాతీల్లా వత్తి మధ్యలో బెల్లం మిశ్రమం కొద్దిగా పెట్టి అన్ని వైపులా మడచి బొబ్బట్లు వత్తుకొని పెనంపై రెండువైపుల కాల్చాలి. వేడిగా తింటే కమ్మగా ఉంటాయి.

Updated Date - 2015-08-30T21:01:27+05:30 IST