బొబ్బర్ల బూరెలు

ABN , First Publish Date - 2015-08-30T00:08:08+05:30 IST

కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు, బెల్లం/పంచదార - 1 కప్పు

బొబ్బర్ల బూరెలు

కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు, బెల్లం/పంచదార - 1 కప్పు, యాలకుల పొడి - 1 టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా, మైదా - పావుకేజీ, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: గంటసేపు నానబెట్టిన బొబ్బర్లను కుక్కర్లో 5 నిమిషాలు ఉడికించి, నీరు వడకట్టాలి. బొబ్బర్లలో కొబ్బరి తురుము, యాలకుల పొడి, బెల్లం తరుము/ పంచదార వేసి చేత్తో ముద్దలా కలిపి, నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. ఉప్పు వేసిన మైదాను నీటితో జారుగా కలిపి, ఉండలు ముంచి నూనెలో దోరగా వేగించుకోవాలి.

Updated Date - 2015-08-30T00:08:08+05:30 IST