అల్లం వెల్లుల్లి పులిహోర

ABN , First Publish Date - 2015-08-26T21:42:55+05:30 IST

కావలసిన పదార్థాలు: చింతపండు (చిక్కటి) గుజ్జు - 1 కప్పు, పచ్చిమిర్చి - 6, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి - 8

అల్లం వెల్లుల్లి పులిహోర

కావలసిన పదార్థాలు: చింతపండు (చిక్కటి) గుజ్జు - 1 కప్పు, పచ్చిమిర్చి - 6, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి - 8, మినప్పప్పు - 1 టేబుల్‌ స్పూను, రాత్రి నానబెట్టిన శనగలు - అర కప్పు, ఆవాలు - 1 టీ స్పూను, వేరుశనగపప్పు - 1 కప్పు, కరివేపాకు (విడి ఆకులు) 1 కప్పు, పసుపు - 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు, అన్నం - 1 కిలో బియ్యంతో(పొడిగా) వండింది.
తయారుచేసే విధానం: చింతపండు గుజ్జుతోపాటు పచ్చిమిర్చి, ఉప్పు జతచేసి బాగా ఉడికించి పులుసు తయారుచేసుకొని అన్నంలో కలుపుకోవాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, పసుపు, వేరుశనగపప్పు, అల్లంవెల్లులి పేస్టులతో తాలింపు వేసుకొని చింతగుజ్జు కలిపిన అన్నంలో బాగా కలపాలి.

Updated Date - 2015-08-26T21:42:55+05:30 IST