అన్నం గారెలు

ABN , First Publish Date - 2015-08-26T21:44:44+05:30 IST

కావలసిన పదార్థాలు: అన్నం- రెండుకప్పులు, బంగాళాదుంప ముక్కలు - ఒక కప్పు, టమాటా ముక్కలు - ఒక కప్పు, బీన్స్‌ ముక్కలు - ఒక కప్పు

అన్నం గారెలు

కావలసిన పదార్థాలు: అన్నం- రెండుకప్పులు, బంగాళాదుంప ముక్కలు - ఒక కప్పు, టమాటా ముక్కలు - ఒక కప్పు, బీన్స్‌ ముక్కలు - ఒక కప్పు, క్యారెట్‌ ముక్కలు - ఒక కప్పు, అల్లం ముక్కలు - రెండు టీస్పూన్లు, బియ్యం పిండి - రెండు టీస్పూన్లు, కారం - ఒక టీస్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: అన్నం, బంగాళాదుంప ముక్కలు, టమాటా ముక్కలు, బీన్స్‌ ముక్కలు, క్యారెట్‌ ముక్కలు, అల్లం ముక్కలు, బియ్యం పిండి, కారం, ఉప్పు అన్నీ ముద్దలా రుబ్బుకుని, గుండ్రంగా ఒత్తుకుని నూనెలో దోరగా వేగించి తీసుకోవాలి. ఇవి కొబ్బరి పచ్చడి లేదా టమాటా పచ్చడితో తినడానికి బాగుంటాయి.

Updated Date - 2015-08-26T21:44:44+05:30 IST