ఆలూ పకోడీ కర్రీ

ABN , First Publish Date - 2015-08-26T22:23:39+05:30 IST

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - పావు కిలో, ఆలుగడ్డలు - 2, ఉల్లిపాయ - 1, టమోటాలు - 2

ఆలూ పకోడీ కర్రీ

కావలసిన పదార్థాలు
పెసరపప్పు - పావు కిలో, ఆలుగడ్డలు - 2, ఉల్లిపాయ - 1, టమోటాలు - 2, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, నూనె - ఒక కప్పు, కారం - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, గరం మసాల - అర టీ స్పూను, కొత్తిమీర - 1 కట్ట, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారుచేసే విధానం
 
(4 గంటలు) నానబెట్టిన పెసరపప్పులో కొద్దిగా ఉప్పు కలిపి చిక్కగా రుబ్బి, పకోడీలు వేసుకొని పక్కనుంచాలి. ఒక టేబుల్‌ స్పూన్‌ నూనెలో ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేగించి, మెత్తగా రుబ్బుకోవాలి. మరో కడాయిలో అల్లం వెల్లుల్లి, ఉల్లి పేస్టు వేగించి, టమోటా తరుగు, కారం, పసుపు వేయాలి. 5 నిమిషాల తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. చిక్కబడ్డాక పెసర పకోడీలు, గరం మసాల, కొత్తిమీర కలిపి చిన్నమంటపై మూడు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడివేడి అన్నంతో లేదా రోటీతో చాలా రుచిగా ఉండే కర్రీ ఇది.

Updated Date - 2015-08-26T22:23:39+05:30 IST