వాంగీ బాత్‌

ABN , First Publish Date - 2015-09-01T18:37:13+05:30 IST

కావలసిన పదార్థాలు: బియ్యం - ఒకటిన్నర కప్పు, వంకాయలు - 2,

వాంగీ బాత్‌

కావలసిన పదార్థాలు: బియ్యం - ఒకటిన్నర కప్పు, వంకాయలు - 2, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర - 1 టీ స్పూను, శనగపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి - 1, ఉల్లిపాయ - 1, కరివేపాకు - 4 రెబ్బలు, పసుపు - పావు టీ స్పూను, ్‌వాంగీబాత్‌ మసాల పొడి - రెండున్నర టేబుల్‌ స్పూన్లు, కారం - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - తగినంత, పచ్చిబఠాణి - అర కప్పు, చింతపండు గుజ్జు - అర టీ స్పూను, నెయ్యి - 1 టేబుల్‌ స్పూను, పచ్చి పల్లీలు - అరకప్పు.
్‌ వాంగీబాత్‌ పొడి తయారీ: లవంగాలు, యాలకులు - 2 చొప్పున, షాజీరా, మెంతులు, జాజికాయ పొడి - అర టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి - 6, దాల్చినచెక్క - అంగుళం ముక్క, ఇంగువ - చిటికెడు, దనియాలు, మినప్పప్పు, శనగపప్పు - రెండు టీ స్పూన్ల చొప్పున, నువ్వులు - 1 టేబుల్‌ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, కొబ్బరిపొడి - 3 టేబుల్‌ స్పూన్లు. (ఇవన్నీ చిన్న మంటపై వేగించి, చల్లారిన తర్వాత పొడి చేయాలి)
తయారుచేసే విధానం: బియ్యంలో రెండున్నర కప్పుల నీరు పోసి (పొడి పొడిగా) అన్నం వండి చల్లార్చాలి. నూనెలో జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, ఉల్లిపాయ తరుగు దోరగా వేగించి పసుపు, వంకాయ ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత పచ్చిబఠాణి, కారం, వాంగీబాత్‌ మసాల పొడి, ఉప్పు, చింతపండు గుజ్జు కలపాలి. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి (మూడు నిమిషాలకు ఒకసారి అడుగంటకుండా ముక్కల్ని ఎగరేయాలి). ఇప్పుడు అన్నం, నెయ్యి కలిపి మూత పెట్టి మంట తీసేసి 10 నిమిషాలు ఉంచాలి.

Updated Date - 2015-09-01T18:37:13+05:30 IST