చిలగడ దుంప కొబ్బరి కూర

ABN , First Publish Date - 2015-09-03T16:05:55+05:30 IST

కావలసిన పదార్థాలు: తొక్కతీసిన చిలగడదుంప ముక్కలు (క్యూబ్స్‌) - 1 కప్పు, ఎండుకొబ్బరిపొడి

చిలగడ దుంప కొబ్బరి కూర

కావలసిన పదార్థాలు: తొక్కతీసిన చిలగడదుంప ముక్కలు (క్యూబ్స్‌) - 1 కప్పు, ఎండుకొబ్బరిపొడి - 1 టేబుల్‌స్పూను, కారం - అర టీ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో చిలగడదుంప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించి చల్లారనివ్వాలి. నూనెలో ఎండు కొబ్బరి, కారం కొద్దిగా వేగనిచ్చి దుంపల్ని వేసి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత దించేయాలి. ఈ కూర వేడి వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది.

Updated Date - 2015-09-03T16:05:55+05:30 IST