చామదుంపలు పుట్నాల వేపుడు

ABN , First Publish Date - 2015-09-03T16:03:59+05:30 IST

కావలసిన పదార్థాలు: చామదుంపలు - పావు కేజీ, పుట్నాల పప్పు - అర కప్పు, పల్లీలు - అర కప్పు

చామదుంపలు పుట్నాల వేపుడు

కావలసిన పదార్థాలు: చామదుంపలు - పావు కేజీ, పుట్నాల పప్పు - అర కప్పు, పల్లీలు - అర కప్పు, జీడి పప్పు - కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి - మూడు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, ఎండుమిరపకాయలు - మూడు, జీలకర్ర - మూడు టేబుల్‌ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, మినప్పప్పు - మూడు టేబుల్‌ స్పూన్లు, కారం - టీస్పూను, నూనె - తగింత.
తయారుచేసే విధానం: ఒక కడాయిలో మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు కొద్దిగా నూనె వేసి వేగించి, చల్లారాక అందులో పుట్నాల పప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరో కడాయిలో నూనె పోసి ఉడికించిన చామదుంప ముక్కలను దోరగా వేగించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వేగించిన ముక్కల్లో పుట్నాల మిశ్రమం పొడి, ఎండుకొబ్బరి పొడి, పసుపు, కారం, వే గించిన జీడిపప్పు వేసి కొత్తిమీర చల్లుకోవాలి.

Updated Date - 2015-09-03T16:03:59+05:30 IST