దొండకాయ గుత్తికూర

ABN , First Publish Date - 2015-09-03T16:48:02+05:30 IST

కావలసిన పదార్థాలు: దొండకాయలు - 20, జీలకర్ర - 1 టీ స్పూను, శనగపప్పు - 5 టీ స్పూన్లు, ఎండుమిర్చి

దొండకాయ గుత్తికూర

కావలసిన పదార్థాలు: దొండకాయలు - 20, జీలకర్ర - 1 టీ స్పూను, శనగపప్పు - 5 టీ స్పూన్లు, ఎండుమిర్చి -4, వెల్లుల్లి - 5 రేకలు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు. తాలింపు కోసం: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, నూనె సరిపడా.
తయారుచేసే విధానం: జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి దోరగా వేగించి వెల్లుల్లి, ఉప్పు కలిపి పొడి కొట్టి, ఒక టీ స్పూను నూనె కలపాలి. దొండకాయలకు (మూడొంతులు) నిలువుగా కత్తితో ‘+ ’ ఆకారంలో గాటు పెట్టి ఈ మిశ్రమం కూరి అరగంట పక్కనుంచాలి. కడాయిలో నూనె వేడెక్కాక ఈ దొండకాయల్ని సన్నని సెగమీద మగ్గించాలి. తర్వాత మరో కడాయిలో తాలింపు వేసి మగ్గిన దొండకాయల్ని విరక్కుండా వేగించి దించేయాలి.

Updated Date - 2015-09-03T16:48:02+05:30 IST