దొండకాయ మసాలా కర్రీ

ABN , First Publish Date - 2015-09-03T16:51:01+05:30 IST

కావలసిన పదార్థాలు: దొండకాయలు - 40, టమోటాలు - 2, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు

దొండకాయ మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు: దొండకాయలు - 40, టమోటాలు - 2, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - అరకప్పు, బ్రౌన్‌ షుగర్‌ - 1 టేబుల్‌ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను, (వేగించిన) వేరుశనగపప్పు పొడి - అరకప్పు, కారం - 1 టీ స్పూను, ఆమ్‌చూర్‌ పొడి - 1 టీ స్పూను, నువ్వులు - 2 టేబుల్‌ స్పూన్లు, గసగసాలు - 1 టేబుల్‌ స్పూను, దనియాలు - 1 టేబుల్‌ స్పూను, మెంతులు - 1 టీ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, బిర్యాని ఆకు - 1, లవంగాలు - 2.
తయారుచేసే విధానం: నువ్వులు, గసగసాలు కలిపి వేగించి పొడిచేయాలి. దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా కోసుకోవాలి. మిగతా మసాల దినుసులను కూడా సన్నమంట మీద వేగించి పొడిచేయాలి. దొండముక్కల్ని నూనెలో దోరగా వేగించాలి. కడాయిలో 1 టేబుల్‌స్పూను నూనె వేసి కరివేపాకు, టమోటాలు వేగాక కారం, మసాలపొడి దొండముక్కలు కలపాలి. నువ్వులు, గసగసాలపొడి, బ్రౌన్‌షుగర్‌, ఆమ్‌చూర్‌పొడి వేసి రెండు నిమిషాల తరాథ్వత కప్పు నీరు, ఉప్పు కలిపి మూతపెట్టాలి. 5 నిమిషాల తర్వాత వేరుశనగపొడి, మరో పావు కప్పు నీరు, కొత్తిమీర చల్లి నీరు ఆవిరయ్యేవరకు ఉంచి దించేయాలి.

Updated Date - 2015-09-03T16:51:01+05:30 IST