చిలగడ దుంపలతో పచ్చిబఠాణీ కూర

ABN , First Publish Date - 2015-09-03T16:07:10+05:30 IST

కావలసిన పదార్థాలు: చిలగడదుంపలు - 2, పచ్చిబఠాణీలు - 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను

చిలగడ దుంపలతో పచ్చిబఠాణీ కూర

కావలసిన పదార్థాలు: చిలగడదుంపలు - 2, పచ్చిబఠాణీలు - 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, గరం మసాల, సోంపు పొడి - అర టీ స్పూను చొప్పున, దనియాల పొడి - 1 టీ స్పూను, కారం - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 2, మిరియాల పొడి - చిటికెడు, నూనె - 1 టేబుల్‌ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, యాలకులు - 2, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - పావుకప్పు.
తయారుచేసే విధానం : చిలగడదుంపల్ని 70 శాతం ఉడికించి తొక్కతీసి క్యూబ్స్‌గా కట్‌ చేసుకోవాలి. నూనెలో జీలకర్ర, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి తరుగు, (చిదిమిన) యాలకులు, అల్లంవెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. తర్వాత ఉప్పుతో పాటు పొడులన్నీ వేసి కలిపి అర కప్పు నీరు పోయాలి. నిమిషం తర్వాత ఉడికించిన పచ్చిబఠాణి, చిలగడదుంపల ముక్కలు కలిపి మూతపెట్టి చిన్నమంటపై మగ్గించాలి. తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర పరాటాలతో బాగుంటుంది.

Updated Date - 2015-09-03T16:07:10+05:30 IST