కొర్రల కర్డ్‌ బాత్‌

ABN , First Publish Date - 2015-09-04T20:11:24+05:30 IST

కావలసిన పదార్థాలు: కొర్రలు - అరకప్పు, పెరుగు - ఒకటిన్నర కప్పు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు

కొర్రల కర్డ్‌ బాత్‌

కావలసిన పదార్థాలు: కొర్రలు - అరకప్పు, పెరుగు - ఒకటిన్నర కప్పు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు - అర టీ స్పూను చొప్పున, తరగిన అల్లం - 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిర్చి - 3, ఎండుమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: కొర్రల్ని కడిగి, ఒకటిన్నర కప్పు నీటిలో 3 విజిల్స్‌ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించి పక్కనుంచాలి. నూనెలో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించి మంట తీసేయాలి. తాలింపు చల్లారిన తర్వాత ఉడికించిన కొర్రలు, పెరుగు, ఉప్పు కలిపి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2015-09-04T20:11:24+05:30 IST