మెంతి పూరీలు

ABN , First Publish Date - 2015-09-04T20:51:51+05:30 IST

కావలసిన పదార్థాలు: చిన్నమెంతి తరుగు (అరకప్పు), గోధుమ/మైదా పిండి - 300 గ్రా., గోరువెచ్చని పాలు

మెంతి పూరీలు

కావలసిన పదార్థాలు: చిన్నమెంతి తరుగు (అరకప్పు), గోధుమ/మైదా పిండి - 300 గ్రా., గోరువెచ్చని పాలు - 1 కప్పు, జీరా పొడి - 1 స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: వెడల్పాటి పళ్లెంలో గోధుమ/ మైదా పిండి, మెంతి తరుగు, జీరాపొడి వేసి పాలలో ఉప్పుని కరిగించి కొద్ది కొద్దిగా పిండిలో పోస్తూ (అవసరమైతే కొన్ని నీళ్లు వాడి) ముద్దలా కలుపుకోవాలి. దీన్ని అరగంట పాటు నానబెట్టాలి. ముద్దని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని పూరీల్లా వత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి. ఈ పూరీలు పెరుగు చట్నీతో చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-04T20:51:51+05:30 IST