వెజిటెబుల్‌ కోన్స్‌

ABN , First Publish Date - 2015-09-05T17:39:43+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ తురుము - 1 కప్పు, పచ్చిబఠాణి - 1 కప్పు, బంగాళదుంప క్యూబ్స్‌

వెజిటెబుల్‌ కోన్స్‌

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ తురుము - 1 కప్పు, పచ్చిబఠాణి - 1 కప్పు, బంగాళదుంప క్యూబ్స్‌ - 2 కప్పులు, ఎరుపు, ఆకుపచ్చ క్యాప్సికం తరుగు - అరకప్పు చొప్పున, టమోటా తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్‌ స్పూను, పనీర్‌ క్యూబ్స్‌ - 200 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, మైదా పేపర్‌ కోన్స్‌ (మార్కెట్లో దొరుకుతాయి) - 10.
తయారుచేసే విధానం: బంగాళదుంప, క్యారెట్‌+పచ్చిబఠాణి, టమోటా+ క్యాప్సికం విడివిడిగా ఉడికించుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పు, పచ్చిమిర్చి తరుగు చేర్చి అన్నీకలిపి 1 టీ స్పూను నూనెలో రెండు నిమిషాలు చిన్నమంటపై వేగించి చేత్తో మెదిపిన పనీర్‌ కలిపి దించేయాలి. చల్లారిన తర్వాత కోన్స్‌లోకి నింపాలి. టమోటా కెచప్‌తో నంజుకుంటే చాలా బాగుంటాయి. మిశ్రమంలోని ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, పసుపు రంగులు పిల్లల్ని బాగా ఆకర్షిస్తాయి.

Updated Date - 2015-09-05T17:39:43+05:30 IST