దమ్‌ గోబీ

ABN , First Publish Date - 2015-10-04T15:39:48+05:30 IST

కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్‌: రెండు పువ్వులు, ఉల్లిపాయలు: ఆరు లేక ఏడు,

దమ్‌ గోబీ

కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్‌: రెండు పువ్వులు, ఉల్లిపాయలు: ఆరు లేక ఏడు, జీడిపప్పు: పావు కప్పు, ఎండుమిరపకాయలు: ఏడు లేక ఎనిమిది, పసుపు:చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడ, లవంగాలు: నాలుగు లేక ఐదు, దాసించెక్క: చిన్నది, జీలకర్ర: టేబుల్‌ స్పూను, ధనియాలు: టేబుల్‌ స్పూను, కొబ్బరి పొడి: అరకప్పు
తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలు వేయించుకొని అందులో జీడిపప్పు ఎండు మిరపకాయలు, లవంగాలు, దాసించెక్క, జీలకర్ర, ధనియాలు, కొబ్బరిపొడి అన్నీ వేసి ముద్దగా నూరి పెట్టుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్‌ను విడదీసి తగినంత నూనె వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతున్న సమయంలోనే రుబ్బి పెట్టుకున్న ముద్ద వేసి ఉడికించుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు కూడా కలుపుకోవచ్చు. మసాలా మరీ గట్టిపడకుండా కొద్దిగా పలుచగా వున్న సమయంలోనే దించేసుకోవాలి. ఇది చపాతీలు లేదా వేడి వేడి అన్నంలోకి రుచిగా వుంటుంది.

Updated Date - 2015-10-04T15:39:48+05:30 IST