ఆనియన్‌ రైస్‌

ABN , First Publish Date - 2015-10-18T16:03:48+05:30 IST

కావలసిన పదార్థాలు: అన్నం: రెండుకప్పులు, ఉల్లిపాయలు: రెండు

ఆనియన్‌ రైస్‌

కావలసిన పదార్థాలు
అన్నం: రెండుకప్పులు, ఉల్లిపాయలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), వెల్లుల్లి రెమ్మలు: రెండు లేదా మూడు(మరీ మెత్తగా కాకుండా చితగొట్టుకోవాలి), ఆవాలు: టీ స్పూను, జీడిపప్పు- పదిగ్రాములు, పచ్చిమిరపకాయలు: నాలుగు(ముక్కలు చేసుకోవాలి), మిరియాల పొడి: టేబుల్‌ స్పూను, నిమ్మరసం: రెండు స్పూన్లు, ఉప్పు:రుచికి సరిపడ, నూనె: సరిపడ.
 
తయారీ విధానం
మందపాటి గిన్నె లేదా బాండీలో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు జత చేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకుని దానికి మిరయాల పొడి, ఉప్పు జత చేసి నిమిషం పాటు వేయించి అనంతరం అన్నం జతచేయాలి. దింపే ముందు నిమ్మరసం పిండుకుంటే రుచిగా వుంటుంది. వేయించిన జీడపప్పుతో గార్నిష్‌ చేసుకుంటే బాగుంటుంది.

Updated Date - 2015-10-18T16:03:48+05:30 IST