క్యాప్సికం రైస్‌

ABN , First Publish Date - 2015-08-30T00:16:57+05:30 IST

కావలసిన పదార్థాలు: బియ్యం - ఒకటిన్నర కప్పు, క్యాప్సికం - 1, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, టమోటా - 1, ఉల్లిపాయ తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - 4,

క్యాప్సికం రైస్‌

కావలసిన పదార్థాలు
 
బియ్యం - ఒకటిన్నర కప్పు, క్యాప్సికం - 1, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, టమోటా - 1, ఉల్లిపాయ తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - 4, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూను, దనియాల పొడి - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, కారం - 1 టీ స్పూను, పనీర్‌ క్యూబ్స్‌ - 1 కప్పు, కొత్తిమీర - అలంకరణకు, లవంగాలు - 4, యాలకులు - 4, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, షాజీరా - అర టీ స్పూను.
 
తయారుచేసే విధానం
 
బియ్యం కడిగి పొడి పొడిగా అన్నం వండి చల్లారనివ్వాలి. నూనెలో మసాల దినుసులు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. కారం, ఉప్పు, పసుపు, దనియాల పొడి కూడా వేగించి టమోటా, పనీర్‌ ముక్కలు వేసి మూతపెట్టాలి. 2 నిమిషాల తర్వాత క్యాప్సికం ముక్కలు కలపాలి. క్యాప్సికం రంగు మారకుండానే అన్నం కలిపి స్టౌవ్‌పైన 4 నిమిషాలు ఉంచాలి. తర్వాత కొత్తిమీరతో అలంకరించాలి. రైతా దీనికి మంచి కాంబినేషన్‌.

Updated Date - 2015-08-30T00:16:57+05:30 IST