తీపి కాకరకాయ కూర

ABN , First Publish Date - 2015-09-04T16:47:03+05:30 IST

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - కేజీ, ఉల్లిపాయలు - రెండు, నూనె - ఒక కప్పు, పచ్చిమిరపకాయల కారం

తీపి కాకరకాయ కూర

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - కేజీ, ఉల్లిపాయలు - రెండు, నూనె - ఒక కప్పు, పచ్చిమిరపకాయల కారం - రెండు చెంచాలు, ఎండు కొబ్బరి - 3చెంచాలు, ఆవాలు, జీలకర్ర - చెంచా, పెరుగు - అర కప్పు , పాలు - అరకప్పు, పసుపు - చిటికెడు , పంచదార - చెంచా.
తయారీ విధానం: ముందుగా కాకరకాయలు, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఓ బాణలిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీరకర్ర వేసి కాస్త వేయించాలి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేయాలి. అవి దోరగా వేగిన తరువాత ఉల్లిపాయలను కూడ వే యాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత పచ్చిమిరపకాయల కారం వేసి, వేగాక అందులో పాలు, పెరుగు పోసి బాగా కలపాలి. ఐదు నిమిషాల తరువాత ఎండు కొబ్బరి, పసుపు వేయాలి. కూర దగ్గరగా వచ్చాక చక్కెర వేస్తే ‘తీపి కాకరకాయ కూర’ రెడీ అయినట్టే! ఇది అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-04T16:47:03+05:30 IST