తోటకూర మినప వడియాలు

ABN , First Publish Date - 2015-09-04T16:49:21+05:30 IST

కావలసిన పదార్థాలు: మినపవడియాలు - 1 కప్పు, తోటకూర - 2 కట్టలు, ఉల్లిపాయలు - 2, వెల్లుల్లి

తోటకూర మినప వడియాలు

   కావలసిన పదార్థాలు: మినపవడియాలు - 1 కప్పు, తోటకూర - 2 కట్టలు, ఉల్లిపాయలు - 2, వెల్లుల్లి - 6 రేకలు, ఎండు మిర్చి - 3, మినపప్పు, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, పసుపు - చిటికెడు, మసాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: తోటకూరని శుభ్రం చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి సన్నగా తరగాలి. కడాయిలో 1 టేబుల్‌ స్పూను నూనె వేసి మినపవడియాలు దోరగా వేగించి తీసి పక్కనుంచాలి. అదే కడాయిలో మిగతా నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లి తరుగు, మసాలపొడి ఒక దాని తర్వాత ఒకటి వేగించి తోటకూర తరుగు, పసుపు వేసి మూతబెట్టి (అవసరమైతే పావు కప్పు నీరు కలిపి) సన్నని మంటపై మగ్గబెట్టాలి. తోటకూర ఉడికిన తర్వాత ఉప్పు, వడియాలు కలిపి మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి. ఈ కూర వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది. (మినపవడియాలకు బదులు పనీర్‌ ముక్కలతో కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు)

Updated Date - 2015-09-04T16:49:21+05:30 IST