ltrScrptTheme3
వంటలు

కావలసిన పదార్థాలు: తోట కూర - ఆరు కట్టలు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - నాలుగు, శెనగపప్పు - ఒక టేబుల్‌ స్పూను, మినపపప్పు - ఒక టేబుల్‌ స్పూను, ఎండు మిరపకాయలు - రెండు, వెల్లుల్లి రేకలు - నాలుగు, కరివేపాకు - ఒక రెబ్బ, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ఉల్లిపాయని ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. తరువాత తోటకూరని కూడా సన్నగా తరగాలి. ఇప్పుడు స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా వెడెక్కాక వెల్లుల్లి రేకలు, శెనగపప్పు, మినపపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తరువాత ఎండు మిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. చివర్లో కొద్దిగా పసుపు, ఉప్పు, తోటకూర తురుము వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత దించేయాలి.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.