కార్న్‌ కబాబ్‌

ABN , First Publish Date - 2016-07-09T16:04:13+05:30 IST

కావలసిన పదార్థాలు: కార్న్‌ - 2 కప్పులు, ఉడికించి తురిమిన ఆలూ - అర కప్పు , చీజ్‌ తురుము - 2 టే.స్పూన్‌, పచ్చిమిర్చి - 2, అల్లం తరుగు - 2 టే.స్పూన్లు,

కార్న్‌ కబాబ్‌

కావలసిన పదార్థాలు: కార్న్‌ - 2 కప్పులు, ఉడికించి తురిమిన ఆలూ - అర కప్పు , చీజ్‌ తురుము - 2 టే.స్పూన్‌, పచ్చిమిర్చి - 2, అల్లం తరుగు - 2 టే.స్పూన్లు, మిరియాల పొడి - అర టీస్పూను, గరం మసాలా - అర టీస్పూను, జాపత్రి పొడి - చిటికెడు, పుదీనా ఆకులు - కొన్ని, ఉప్పు, నూనె - తగినంత. 
 
తయారీ విధానం: మిక్సీలో కార్న్‌ వేసి పొడి చేసుకోవాలి. మిగతా దినుసులన్నింటినీ కార్న్‌పొడిలో కలపాలి. ఈ పిండితో గారెలంత సైజుల్లో కబాబ్స్‌ చేసుకోవాలి. పెనం మీద నూనె వేసి వీటిని రెండు వైపులా కాల్చాలి. వేడి వేడిగా పుదీనా పచ్చడితో తినాలి.

Updated Date - 2016-07-09T16:04:13+05:30 IST